
అప్రమత్తంగా ఉండండి
వర్షాల నేపథ్యంలో
కంట్రోల్ రూం ఏర్పాటు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (93919 42254) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈత మొక్కలునాటిన ఎకై ్సజ్ అధికారులు
పాపన్నపేట(మెదక్): వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని గాంధారిపల్లిలో ఎకై ్సజ్ అధికారులు ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ చెట్లతోనే మానవ మనుగడ అన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు నిచ్చారు. వర్షాకాలం మొక్కలు నాటేందుకు అనువైన కాలమన్నారు. ఈత మొక్కలు గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలోఎస్సై మాన్‌సింగ్, కానిస్టేబుళ్లు, గీత కార్మికులు పాల్గొన్నారు.
ఈ పాస్ విధానంతోనే
ఎరువుల విక్రయం
జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్
చిన్నశంకరంపేట(మెదక్): రైతులకు ఎరువులను తప్పని సరిగా ఈ పాస్ విధానం ద్వారా ఆధార్ నమోదుతోనే విక్రయాలు చేయాలని లేదా ఫర్టిలైజర్ దుకాణదారులపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించిన, అక్రమంగా యూరియాను తరలించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
సర్దుబాటును సరిదిద్దండి
పీఆర్టీయూ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా శాసీ్త్రయంగా నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యానాయక్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ రాధాకిషన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమున్న చోట సబ్జెక్టులు, కాంప్లెక్స్‌ల వారీగా మండల, జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాలని సూచించారు. అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలలను ప్రాధాన్యత క్రమంలో సర్దుబాటు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను, ఉన్నత పాఠశాలలో ఎస్జీటీలను సర్దుబాటు చేశారు. దానిని పునఃపరిశీలించాలని కోరారు. సీనియర్ ఉపాధ్యాయులు సర్దుబాటుకు వెళ్లేందుకు సుముఖంగా ఉంటే అవకాశం కల్పించాలన్నారు. సర్దుబాటు విషయంలో కొంతమందికి అన్యాయం జరిగిందన్నారు.
ఓపెన్ పరీక్షల
ఫీజు షెడ్యూల్ విడుదల
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో సప్లిమెంటరీ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల అయ్యిందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన వారు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 5వరకు, రూ.50 అపరాధ రుసుముతో 15వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ వెంకటస్వామి (8008403635)ని సంప్రదించాలన్నారు.

అప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి