
సంఘటితమైతేనే సమస్యలు పరిష్కారం
మెదక్‌జోన్: సమస్యల సాధన కోసం ఉద్యోగులు సంఘటితం కావాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో సహకార శాఖ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశఃలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ వ్యవస్థ ప్రమాదంలో ఉందని, నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. ఉద్యోగులకు రాజ్యాంగపరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘటితం కావాలన్నారు. జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్‌తో కలిసి వారికి నిమాయక పత్రాలు అందజేశారు. అంతకుముందు సహకార శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సహకార శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించామన్నారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిర్మల రాజకుమారి, సహకార శాఖ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రాజవర్ధన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్, డీసీఓ కరుణాకర్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షుడు శేషాచారి పాల్గొన్నారు. కాగా, సహకారం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామాగౌడ్, ఉపాధ్యక్షులుగా బట్టి రాధాకృష్ణ, శ్రీకాంత్, పూర్ణచందర్, కార్యదర్శిగా సంగమేశ్వర్, కోశాధికారిగా యాకూబ్ అలీ, సంయుక్త కార్యదర్శిగా భరత్ కృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా మోహన్ కార్యవర్గ సభ్యులుగా దినేష్ కుమార్, శివకుమార్, సత్యనారాయణలు ఎన్నికయ్యారు.