
ముందు జాగ్రత్త తప్పనిసరి
రామాయంపేట(మెదక్): జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ శుక్రవారం మండలంలోని సుతారిపల్లిలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామంలో తిరుగుతూ పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న జ్వర సర్వేను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి హరిప్రసాద్, ప్రగతి ధర్మారం మెడికల్ ఆఫీసర్ హరిప్రియ, సిబ్బంది ఉన్నారు.