
సకాలంలో సీఎంఆర్ అప్పగించాలి
– గన్నె తిరుపతి రెడ్డి, దుబ్బాక / రాంచర్ల వేణుగోపాల్ రెడ్డి, దుబ్బాకటౌన్
కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్: రైస్ మిల్లర్లు సకాలంలో తమ సీఎంఆర్ డెలివరీ చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం, అసిస్టెంట్ సివిల్ సప్‌లై ఆఫీసర్ అబ్దుల్ నిసార్‌తో కలిసి సాయికృష్ణ రైస్‌మిల్లును పరిశీలించారు. బకాయి పడిన బియ్యం సకాలంలో ప్రభుత్వానికి అందజేయాలని యజమానులకు సూచించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2023–24 రబీ సీజన్‌లో ప్రభుత్వం జిల్లాలోని 67 రైస్ మిల్లులకు రెండు లక్షల 52వేల 13 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించిందని చెప్పారు. ఇంకా 5,965 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రైస్ మిల్లర్లు తమ లక్ష్యాలకు అనుగుణంగా ఈనెల 27లోపు బకాయి ఉన్న బియ్యం ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. సీఎంఆర్ సకాలంలో ఇవ్వని రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రైస్‌మిల్లర్లు, సివిల్ సప్‌లై అధికారులు సమన్వయంతో సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
8లో