
పెట్టుబడిదారులకు మోదీ వత్తాసు
● సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశ ప్రజలకు ప్రమాదం నెలకొంటుందని, పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు అన్నారు. శనివారం మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్మికవర్గాన్ని బానిసలను చేయడం కోసమే మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చిందని మండిపడ్డారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేశాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 7, 9 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్ని పార్టీలున్నా కార్మిక వర్గానికి సీఐటీయూ జెండాయే అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శిగా మల్లేశం ఎన్నికయ్యారు.