
మెదక్‌కు నిధుల వరద
మెదక్‌జోన్: మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని, ఇక్కడి నుంచి గెలుపొంది ప్రధాని అ య్యారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి జిల్లా అభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. మెదక్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఏడుపాయల అమ్మవారి ఆలయాలకు సీఎం రేవంత్‌రెడ్డి కోట్లాది రూపాయల నిధులిచ్చారన్నారు. కేసీఆర్ ఏనాడైనా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారా..? అని ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, అభివృద్ధిలో మెదక్‌ను అగ్రగామిలో నిలబెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు.
చర్చి, ఏడుపాయలకు నిధులిచ్చింది కాంగ్రెస్సే..
బీఆర్‌ఎస్ పాలనలో ప్రగతి శూన్యం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్