
స్వచ్ఛతపై కేంద్ర బృందం ఆరా
పాపన్నపేట(మెదక్): గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమం పరిశీలించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కేంద్ర బృందం సభ్యులు సుమలత, రాణి గురువారం కొడుపాక, చిత్రియాల్ గ్రా మాల్లో పర్యటించారు. ఈసందర్భంగా పాఠశాలలు, అంగన్‌వాడీ, మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డ్ నిర్వహణ, ఇంకుడు గుంతలు తదితర వాటిని పరిశీలించారు. పథకాల అమలు తీరును గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మిన్‌పూర్, అర్కెల గ్రామల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణువర్ధన్, ఇన్‌చార్జి ఎంపీఓ పరమేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు బాబునాయక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.