ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి

Jul 16 2025 9:16 AM | Updated on Jul 16 2025 9:16 AM

ఇందిర

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి

కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

చేగుంట(తూప్రాన్‌): ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. మండలంలోని పులిమామిడితోపాటు బోనాల గ్రామాలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇళ్ల నిర్మాణం దశలను బట్టి ప్రభుత్వం డబ్బులను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో 9వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 5వేల ఇళ్లకు గ్రౌండింగ్‌ పూర్తి చేసి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లోని పలు వీధులలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచనలు చేశారు. పాఠశాలల్లో సందర్శించి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డితోపాటు పలు శాఖల అధికారులు ఉపాధ్యాయులున్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి

జేడ్పీ సీఈఓ ఎల్లయ్య

తూప్రాన్‌: ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని జేడ్పీ సీఈఓ, మండల ప్రత్యేకాధికారి ఎల్లయ్య పేర్కొన్నారు. మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అడవులు పెంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీశ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, అటవీశాఖ అధికారి ప్రకాశ్‌, ఏపీఓ సంతోశ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

మెప్మా పీడీ హన్మంతరెడ్డి

రామాయంపేట(మెదక్‌): మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులనుంచి తీసుకుంటున్న రుణాలను సద్వినియోగపర్చుకుని అభివృద్ధి చెందాలని మెప్మా పీడీ హన్మంతరెడ్డి సూచించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వీధి విక్రయదారుల వ్యాపార మేళా (స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌), స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళాను మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే సభ్యులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన కమిషనర్‌తో కలిసి మహిళా సంఘాలు, వీధి వ్యాపారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మెప్మా మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపక

పోస్టులకు ఆహ్వానం

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మెదక్‌ ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో ఇంగ్లిష్‌, ఫిజికల్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, సోషల్‌, గణితం, హిందీ సబ్జెక్టులను బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, పీజీ చేసి 50% మార్కులు తగ్గకుండా ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఈ నెల 19న సంగారెడ్డిలోని ఆర్‌సీఓ కార్యాలయంలో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441250450ను సంప్రదించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి 
1
1/2

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి 
2
2/2

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement