
కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘానికి అవార్డు
పాపన్నపేట(మెదక్): సొసైటీ సభ్యులకు మెరుగైన ఆర్థిక వినిమయ సేవలు అందించి లాభాల్లో రెతులకు 10% డివిడెంట్ పంచిన కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ త్యార్ల రమేశ్‌కు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సహకార శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, నాబార్డ్ జీఎం ఉదయ్‌భాస్కర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. నాబార్డ్ ఆధ్వర్యంలో మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘాన్ని ఎంపిక చేశారు. సొసైటీకి వచ్చిన లాభాల్లో సుమారు రూ.17.50 లక్షలను సభ్య రైతులకు 10% చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. రైతులకు రుణాల పంపిణీ, వాటి రికవరీ, పెట్రోల్, డీజీల్ బంకుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఫర్టిలైజర్ సేవలు తదితర విభాగాల్లో సొసైటీ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేసినట్లు చైర్మన్ రమేశ్ తెలిపారు.