
రేపు నీటి సరఫరాకు అంతరాయం
నర్సాపూర్: ఈనెల 11వ తేదీన నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీటి సరఫరా ఉండదని ఆ పథకం ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. హత్నూర మండలంలోని బోర్పట్ల నుంచి నర్సాపూర్‌కు వచ్చే పైపులైన్‌కు లీకేజీ ఏర్పడినందున మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
నర్సాపూర్ రూరల్: వరికి బదులు ప్రత్యామ్నా య పంటలు సాగు చేసుకోవాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ రైతు వేదికలో జాతీయ ఆహార, పోషక భద్రత పథకం కింద రైతులకు మినుములు, జొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలు సాగు చేసుకునే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ ఓ దీపిక, ఏఈఓ మోహన్ రైతులు పాల్గొన్నారు.
ఎస్‌ఈకి శుభాకాంక్షలు
మెదక్ కలెక్టరేట్: విద్యుత్ శాఖ ఎస్‌ఈగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నాయక్‌ను రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకే) యూనియన్ నాయకులు బుధవారం కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు అశోక్, అధ్యక్షుడు రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, ఉపాధ్యక్షులు ఉస్మాన్, కంపెనీ అసిస్టెంట్ సెక్రటరీ బాలయ్య, సలహాదారులు కిరణ్, మెదక్ డివిజన్ అధ్యక్షులు ఆకుల నాగరాజు అసిస్టెంట్ సెక్రటరీ భిక్షపతి, తూప్రాన్ డివిజన్ అధ్యక్షుడు చేపూరి రాములు, సెక్రటరీ వెంకటయ్య, ప్రభాకర్, సాయిలు, వెంకటేష్, అజీజ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు శ్రద్ధగా చదవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌ను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, బట్టలు, బ్లాంకెట్స్ ఇచ్చారా..? అని ఆరా తీశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. శ్రద్ధగా చదువుకోవాలన్నారు. సమస్యలుంటే వార్డెన్‌కు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ జిల్లా సహాయ అధికారి గంగాకిషన్, వార్డెన్ ప్రణయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: మెదక్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని యూఆర్‌ఎస్‌లలో వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల పురుష అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మెదక్ జిల్లా నివాసులై ఉండాలన్నారు. మెదక్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 5.6 ఎత్తు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులై ఏదైనా సెక్యూరిటీ సంస్థచే శిక్షణ పొంది ఉండాలన్నారు. కనీస వేతనం రూ. 9,750 ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.

రేపు నీటి సరఫరాకు అంతరాయం

రేపు నీటి సరఫరాకు అంతరాయం