
గుణాత్మక విద్యనందించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): నాణ్యమైన, గుణా త్మక విద్యను అందించడానికి ఎంఈఓలు, స్కూ ల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని డైట్ కళాశాలలో ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఎఫ్‌ఎల్‌ఎన్ మానిటరింగ్ సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఉన్నతస్థాయి లో విద్యా ప్రమాణాల మెరుగుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉత్తమ విద్యాబోధన చేసి ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యా యులు పాత్ర కీలకమన్నారు. పని సర్దుబాటు విషయంలో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
మెదక్‌కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ పథకం కింద మిగిలి ఉన్న సీట్లను కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియను విద్యార్థులు తల్లిదండ్రు ల సమక్షంలో నిర్వహించారు. ఈసందర్భంగా మొత్తం 6 సీట్లకు 1వ తరగతికి ముగ్గురు, 5వ తరగతికి ముగ్గరిని ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో షెడ్యూ ల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.