
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుపై అసభ్య పదజాలంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోని కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి