
ఆషాఢం సంబరాలు
టేక్మాల్(మెదక్): మండల కేంద్రంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవ రణలో ఆషాఢమాసం సందర్భంగా మహిళలందరూ కలిసి బుధవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించా రు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు వా యినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకొని ఆట పాటలతో సందడి చేశారు.
అభ్యంతరాలుంటే చెప్పండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని కేజీబీవీలలో ఉద్యోగాల కోసం గతంలో దరఖాస్తు చేసు కున్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి మెరిట్ లిస్ట్‌ను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ రాధాకిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేజీబీవీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ (3), ఏఎన్‌ఎం (4) ఉద్యోగాల భర్తీకి గతంలో మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. మెరిట్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈనెల 12లోగా ఫిర్యాదులు అందజేయాలని సూచించారు.