
శాకంబరిదేవిగా విద్యాధరి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం
వర్గల్ సరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బుధవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ అమ్మవారు పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా ధరించి శాకంబరిదేవిగా దివ్యదర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే మూల మహోత్సవ వేడుకలు మొదలయ్యాయి. గర్భగుడిలో మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఆభరణాలుగా అమ్మవారిని కమనీయంగా అలంకరించారు. కుంకుమార్చన, సప్తశతి పారాయణం, సామూహిక భక్తజన లక్షపుష్పార్చన జరిపారు. చండీహోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ( – వర్గల్(గజ్వేల్)

శాకంబరిదేవిగా విద్యాధరి