
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
తూప్రాన్: పట్టణ పరిధిలోని రావెల్లి మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆర్డీఓ జయచంద్రారెడ్డి బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా హాస్టల్ వసతి, ఆహార ప్రమాణాలు, పరిశుభ్రత.. తదితర అంశాలపై ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణ, భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. కాగా హాస్టల్‌లో సమస్యలను విద్యార్థులు ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారుల సహకారంతో త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.