
నిబంధనలు పాటించాలి
నర్సాపూర్: బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పకడ్బందీగా పాటించాలని స్థానిక ఆర్‌డీఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహిపాల్ సూచించారు. నర్సాపూర్‌లోని వైపర్ కాలేజీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండలంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎల్‌ఓలు తమకు కేటాయించిన బూత్ పరిధిలో కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, ఆర్‌ఐ ఫైజల్, ట్రైనర్లు లక్ష్మినారాయణ, ప్రసన్నకుమార్, శ్రీనివాస్‌యాదవ్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్
పోటీలకు జిల్లా జట్టు
మెదక్ మున్సిపాలిటీ: ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు సభ్యుడు మంగళవారం మెదక్ నుంచి తరలివెళ్లారు. మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ జట్టుకు కోచ్‌గా జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి పి.భాగ్యమ్మను నియమితులయ్యారు.
ఎన్యూమరేటర్లకు
పారితోషికం చెల్లించాలి
నారాయణఖేడ్: గతేడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లకు పారితోషికాన్ని చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ జాదవ్ డిమాండ్ చేశారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మంగళవారం ఖేడ్ మండలంలోని పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేచేసి 8 నెలలు గడుస్తున్నా పారితోషికాన్ని చెల్లించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ రిపోర్టును తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టైంటేబుల్ మార్చాలని, కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించి వారికి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. పాఠశాలల పర్యవేక్షణకోసం ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సంఘ ఖేడ్ మండల ప్రధానకార్యదర్శి శ్రీరామ్‌నాయక్, నాయకులు గంగామోహన్, మంగుబాయి, శోభారాణి, శంకర్‌రావు పాల్గొన్నారు.
ప్రతి మహిళా
కోటీశ్వరులు కావాలి
సంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేశ్‌బాబు
ఝరాసంగం(జహీరాబాద్): మహిళా సంఘాల్లోని ప్రతీ మహిళా కోటీశ్వరుల్ని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన ఝరాసంగం పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీయం టిక్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి