
అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పె ట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలపై అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా ప్రజావాణికి వివిధ సమస్యలపై 61 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో వివిఽ ద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలో సేవాలాల్ భవన్ కోసం స్థలం కేటాయించాలని మండలంలోని ఆయా తండాలకు చెందిన గిరిజనులు కోరారు. ఈమేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మెదక్ పట్టణంలోని పలు చెరువులు, కుంటలు పూర్తిగా మురుగునీటితో కలుషితమవుతున్నాయని, వాటిని కాపాడి తాగునీటి కేంద్రాలుగా చేయాలని సీనియర్ సిటిజెన్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. పట్టణంలోని పలు చెరువులు కబ్జాకు గురయ్యాయని, వాటిని రక్షించాలని కోరారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
ప్రజావాణికి 61 వినతులు
ప్రజలకు సుపరిపాలన అందించాలి
కొల్చారం(నర్సాపూర్): ప్రజా సమస్యలపై జవాబుదారితనంతో వ్యవహరించడం తప్పనిసరిని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ సంబంధిత రికార్డులను పరిశీలించారు. పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసచారి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.