
పేదల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాంగౌడ్, నాయకులు మహేందర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.