
శాఖలవారీగా నివేదికలు ఇవ్వండి
డీఎల్‌పీఓ సాయిబాబ
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి నివేదికలను శాఖలవారీగా ఇవ్వాలని డీఎల్‌పీఓ సాయిబాబ తెలిపారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, జీవనోపాధి, ఉపాధిహామీ పనులు, విద్యుత్ సరఫరా, రక్షిత తాగునీటి పథకం.. తదితర వివరాలను అందించాలని సూచించారు. అధికారులు ఇచ్చిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు నేషనల్ పంచాయతీ అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, విద్యుత్‌శాఖ ఏఈ సాయికుమార్, పీఆర్ ఏఈ మారుతి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఖమర్‌సుల్తానా, లక్ష్మి, ఏపీఓ పుణ్యదాస్ పాల్గొన్నారు.