సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి

Jul 2 2025 7:06 AM | Updated on Jul 2 2025 7:12 AM

సమ్మె

సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి

శివ్వంపేట(నర్సాపూర్‌): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు భాగస్వాములు కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఆశా సిబ్బందితో కలిసి మహేందర్‌రెడ్డి పీహెచ్‌సీ వైద్యురాలు సాయిసౌమ్యకు సమ్మె నోటీసు అందజేశారు. గతంలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రం హరిస్తోందని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తోపాటు ఇతర సమస్యలు సాధించుకునేందుకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు.

కౌడిపల్లి సీహెచ్‌సీలో డాక్టర్స్‌డే

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రం కౌడిపల్లిలోని సీహెచ్‌సీ(పీహెచ్‌సీ) డాక్టర్స్‌ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటలక్ష్మి, పీహెచ్‌సీ డాక్టర్‌ శ్రీకాంత్‌, డాక్టర్‌ ఫెర్నాజ్‌లను వైద్యసిబ్బంది ఘనంగా సన్మానించి కేక్‌ కట్‌చేసి డాక్టర్స్‌డేను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కలను సిద్ధం చేయాలి

పెద్దశంకరంపేట(మెదక్‌): వనమహోత్సవానికి అన్ని గ్రామాల్లో మొక్కలను సిద్ధం చేయాలని ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటాలని గ్రామ కార్యదర్శి సవితకు సూచించారు. నూతన నర్సరీకి సంబంధించి బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈజీఎస్‌ ఏపీఓ సంతోష్‌కుమార్‌, ఫీల్డ్‌అసిస్టెంట్‌ మల్లేశం తదితరులున్నారు.

ఎల్లమ్మ ఆలయం పూజలు

కొల్చారం(నర్సాపూర్‌): మండల కేంద్రంలో కొలువైన రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో మంగళవారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉదయం అభిషేకం, అలంకరణ పూజా కార్యక్రమాలతో పాటు మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో అన్న ప్రసాదం నిర్వహించారు.

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొదటి రోజు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం విద్యార్థులకు ఐడీ, పాస్‌వర్డ్‌ అందజేశామని, ఐడీ పొందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని ప్రిన్సిపాల్‌ గోవర్ధన్‌ తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు అభినవ్‌ పాల్గొన్నారు.

అవగాహన అవసరం

మిరుదొడ్డి(దుబ్బాక): అంతర పంటలతో మ రింత ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కంది సా గుపై అవగాహన ఉండాలని మండల వ్యవసా య అధికారి సత్యాణ్వేష్‌ సూచించారు. జాతీ య ఆహార భద్రత మిషన్‌ పప్పు దినుసులు 2025 పథకంలో భాగంగా రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు

హుస్నాబాద్‌రూరల్‌: పాలిటెక్నిక్‌ కాలేజీ రోడ్డు ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆ దేశించారు.‘కాలేజీకి రోడ్డు నిర్మించరూ..?’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్‌ స్పందించి పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను పనుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీకి రో డ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఈ మ హేశ్‌ మంగళవారం పనులు ప్రారంభించారు.

సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి 
1
1/2

సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి

సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి 
2
2/2

సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement