
భూముల సర్వే అడ్డగింత
చిన్నశంకరంపేట(మెదక్): వివాదంలో ఉన్న భూములను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కామారంతండాలో బుధవారం జరిగింది. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని గిరిజనులు ప్రశ్నించారు. తమకు తెలియకుండానే ఓ రియల్టర్ తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ వివాదం కోర్టులో ఉందని తెలిపారు. పట్టాదారును అని చెప్పుకొనే వ్యక్తి సర్వే వద్దకు ఎందుకు రాలేదని మండిపడ్డారు. సర్వే చేసేందుకు తీసుకువచ్చిన డిజిటల్ మిషన్‌ను గిరిజనులు లాక్కునేందుకు ప్రయత్నించగా అధికారులు సర్వేను మధ్యలోనే నిలిపివేసి వెనక్కి తిరిగారు. ఈసందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. వివాదంలో ఉన్న భూమి విషయంలో పోలీస్‌లు సైతం బడా వ్యక్తులకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్, తూప్రాన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. సర్వే ఏడీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ పట్టదారు దరఖాస్తు చేయడంతోనే తాము సర్వే చేసేందుకు వచ్చామని తెలిపారు. గతంలో సర్వేను అడ్డకోవడంతోనే పోలీస్ బందోబస్తు కోరామని చెప్పారు.
నోటీసులు ఇవ్వకుండా సర్వే
చేయడంపై గిరిజనుల ఆగ్రహ ం