
‘క్యూఆర్‌టీ’ పనితీరు భేష్
మెదక్ మున్సిపాలిటీ: ఏడుపాయల్లోని మంజీరా నదిలో స్నానం చేస్తూ నీటిలో మునిగిన యువతిని కాపాడిన క్యూఆర్‌టీ సిబ్బందికి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి రివార్డు ప్రకటించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంఘటనపై ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా క్యూఆర్‌టీ–1 సిబ్బందిని అభినందించి రివార్డు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.