
ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 25 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షు డు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, ఆర్‌ఎన్. సంతోష్, సంగమేశ్వర్, సుభాష్‌గౌడ్, రాములు, రవీందర్, గోవింద్‌రావు, సాయిలు, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రసాయనాల వాడకం
తగ్గించాలి
టేక్మాల్(మెదక్): రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సహజ ఎరువులను వాడితే అధిక దిగుబడి పొందవచ్చని నత్నాయిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త శోభారాణి అన్నారు. సోమవారం మండలంలోని కుసంగిలో ఏఓ రాం ప్రసాద్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పంటలో ఎక్కువ మొత్తంలో యూరియా వేయడం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుందన్నారు. పంట మార్పిడి తప్పనిసరి అన్నారు. వరి సాగుకు ముందు పచ్చిరొట్ట వేసి కలియదున్నాలన్నారు. అధికారుల సూచన మేరకే ఎరువుల వాడి దిగుబడి పొందాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త లక్ష్మణ్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు యూసూఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని త్వరగా
అన్‌లోడ్ చేసుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైస్‌మిల్లర్లు లారీలలోని ధాన్యాన్ని త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మహమ్మద్‌నగర్ మొండితండా సమీపంలోని రైస్‌మిల్లును తనిఖీ చేశారు. రైస్‌మిల్లులో ధాన్యం, బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్కువ రోజులు లారీలను రైస్‌మిల్ వద్ద ఉంచవద్దని, హమాలీల సమస్య లేకుండా చూసి త్వరగా ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పడు స్టాక్ నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్‌ఐ శ్రీహరి, రైస్‌మిల్ యజమాని తదితరులు పాల్గొన్నారు.
పోరాటయోధుడు ‘పుచ్చలపల్లి’
మెదక్ కలెక్టరేట్: జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాడిన ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అజ్జమర్రి మల్లేశం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా, కేవల్ కిషన్‌భవన్‌లో సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేసిన యోధుడు సుందరయ్య అని కొనియాడారు.

ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు