
చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం
నర్సాపూర్: గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత సూచించారు. శుక్రవారం కోర్టులో లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్ కేసులలో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకొని కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. న్యాయవాదిని నియమించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేద వారికి ఉచితంగా లీగల్ ఎయిడ్ ద్వారా న్యాయవాదిని నియమించేందుకు లీగల్ సర్వీస్ సహకరిస్తుందని చెప్పారు.
సైన్యానికి మద్దతుగా పూజలు
పాపన్నపేట(మెదక్): పాకిస్తాన్‌తో భారత సైన్యాల పోరాటానికి మద్దతుగా దేవాదాయ శాఖ ఉద్యోగులు శుక్రవారం ఏడుపాయల దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. భారత సైన్యం విజయాన్ని కాంక్షిస్తూ, తీవ్రవాద నాశనాన్ని ఆశిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్‌రెడ్డి, అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యాన్ని త్వరగాఅన్‌లోడ్ చేయాలి
హవేళిఘణాపూర్(మెదక్): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లారీలను సరైన సమయంలో అన్‌లోడ్ చేసి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గాయత్రి రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. మూడు లారీలు అన్‌లోడ్ కోసం వేచి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అన్‌లోడ్ చేసి వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
డివిజన్ కేంద్రాల్లో
శిక్షణ ఏర్పాటు చేయాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను డివిజన్ కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, సామ్యనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో ఇస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలో కాకుండా డివిజనల్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రవాణా సౌకర్యాలు, వేసవి తీవ్రత దృష్ట్యా రెండు, మూడు మండలాలను కలిపి ఒకే దగ్గర శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. కొందరు ఉపాధ్యాయులు అత్యవసర పనుల దృష్ట్యా ఒక స్పెల్‌కు హాజరుకాలేకపోతే రెండవ స్పెల్‌కు అనుమతించాలని డీఈఓను కోరారు.
అదనపు కలెక్టర్‌కు పరామర్శ
మెదక్ కలెక్టరేట్: మాతృమూర్తిని కోల్పోయిన అదనపు కలెక్టర్ మెంచు నగేష్‌ను సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామంలో శుక్రవారం జిల్లా అధికారులు పరామర్శించారు. అనంతరం మరణించిన సత్తమ్మ చిత్రపటానికి నివాళులరిప్పంచారు. అదనపు కలెక్టర్‌ను పరామర్శించిన వారిలో డీఆర్‌ఓ భుజంగరావు, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, డీఈఓ రాధాకిషన్, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం