ఉన్నత చదువులకు ‘దూరం’ | - | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులకు ‘దూరం’

May 10 2025 8:18 AM | Updated on May 10 2025 2:07 PM

ఉన్నత

ఉన్నత చదువులకు ‘దూరం’

తూప్రాన్‌లో కలగా మిగిలిన డిగ్రీ కళాశాల

అందరికీ అనుకూలం

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రభు త్వం స్పందించి డిగ్రీ కళా శాల ఏర్పాటు చేస్తే ఇంటర్‌తో పాటు డిగ్రీలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

– ప్రభావతి, ప్రభుత్వ జూనియర్‌

కళాశాల ప్రిన్సిపాల్‌

మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు

డిరగీ కళాశాల లేక అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేస్తు న్నారు. కళాశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టరేట్‌ సైతం ముట్టడించాం. అయినా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా ప్రభు త్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.

– అజయ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు

తూప్రాన్‌: పేద విద్యార్థులకు ఉన్న త చదువులు కలగానే మారాయి. డివిజన్‌ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కోరుతున్నా ఆ దిశగా అడుగు పడడం లేదు. పై చదువుల కోసం విద్యార్థులు మేడ్చల్‌, గజ్వేల్‌, రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేట్‌ కళాశాలల్లో చేరేందుకు తరలివెళ్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రం ఫీజులు చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నారు. అమ్మాయిలు ఇంటి వద్దే ఉంటుండగా.. మగ పిల్లలు పరిశ్రమల్లో కాంట్రాక్ట్‌ కార్మికులుగా చేరుతున్నారు. మరికొందరు జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే డివిజన్‌ చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, వెల్దుర్తి, చేగుంట, దౌల్తాబాద్‌, వర్గల్‌, మనోహరాబాద్‌ మండలాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనంచేకూరుతుంది.

స్థలం కేటాయించినా..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సివిల్‌ సప్‌లై గోడౌన్ల సమీపంలో ప్రభుత్వ స్థలం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. కానీ విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది.

ఉన్నత చదువులకు ‘దూరం’1
1/2

ఉన్నత చదువులకు ‘దూరం’

ఉన్నత చదువులకు ‘దూరం’2
2/2

ఉన్నత చదువులకు ‘దూరం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement