
కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం
ఆరుగాలం పడించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మండల పరిధిలోని నత్తయ్యపల్లిలో కొన్ని రోజుల క్రితం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా రోజూ సాయంత్రం వర్షం పడడంతో ధాన్యం తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. – నర్సాపూర్ రూరల్