సంబురంగా సన్నబియ్యం | - | Sakshi
Sakshi News home page

సంబురంగా సన్నబియ్యం

May 4 2025 8:08 AM | Updated on May 4 2025 8:08 AM

సంబుర

సంబురంగా సన్నబియ్యం

జిల్లాలో పెరిగిన రేషన్‌ కార్డులు 450.. సభ్యులు 15,933

దొడ్డు బియ్యం రీసైక్లింగ్‌కు చెక్‌

న్న బియ్యం సరఫరాతో దొడ్డు బియ్యం రీసైక్లింగ్‌ దందాకు చెక్‌ పడనుంది. గతంలో రేషన్‌ షాపుల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అయితే చాలా మంది లబ్ధిదారులు దొడ్డు అన్నం తినలేక, దళారులకు కిలోకు రూ. 20 నుంచి రూ. 22 చొప్పున అమ్ముకునేవారు. వాటిని దళారులు రైస్‌ మిల్లర్లకు రూ. 25 నుంచి రూ. 26కు కిలో చొప్పున విక్రయించేవారు. చాలా మంది మిల్లర్లు సీఎంఆర్‌ కింద కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకున్న ధాన్యాన్ని మర ఆడించకుండానే బయటకు అమ్ముకునే వారు. బదులుగా బయట దళారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సీడబ్లూసీకి ఇచ్చేవారని తెలుస్తోంది. వడ్లు బయట అమ్ముకొని, అసలు బియ్యం ఇవ్వని పలు రైస్‌ మిల్లులపై కేసులు సైతం నమోదయ్యాయి. ప్రస్తుతం సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో లబ్ధిదారులు తినడానికి ఇష్టపడుతున్నారు. అమ్మడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దళారుల ఆటకట్టే అవకాశముంది. అయితే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ద్వారా తమకు వచ్చే బియ్యంలో సంచికి 2 కిలోల నుంచి 5 కిలలో వరకు తరుగు వస్తుందని రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు.

పాపన్నపేట(మెదక్‌): సన్న బియ్యం బువ్వతో పే దల ఇంట ఆనందం వెల్లి విరుస్తుంది. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా కొత్తగా 450 రేషన్‌ కార్డులతో పాటు 15,933 కొత్త సభ్యులు చేరారు. జిల్లాలో ప్రస్తుతం 2,14,278 రేషన్‌ కార్డులు ఉండగా, వీరికి నెలకు 4,522.789 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం సరఫరాతో దొడ్డు బియ్యం రీసైక్లింగ్‌కు చెక్‌ పెట్టినట్లు అయింది. కాగా సన్న బియ్యం సంచుల్లో 5 కిలోల వరకు తరుగు వస్తుందని రేషన్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2,14,278కు చేరిన రేషన్‌ కార్డులు

జిల్లాలో ప్రస్తుతం 2,14,278 రేషన్‌కార్డులు ఉండగా, అందులో 2,00,353 ఆహార భద్రత, 13,859 అంత్యోదయ, 66 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. 7,11,978 మంది లబ్ధిదారులుండగా, నెలకు 4,522.789 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. ఏప్రిల్‌లో 1,99,902 ఆహార భద్రత, 13,860 అంత్యోదయ, 66 అన్నపూర్ణ కార్డులుండగా, మే నెలలో కొత్తగా 450 కార్డులతో పాటు, 15,933 మంది లబ్ధిదారులు చేరారు. వీరికి అదనంగా 92,293 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం రేషన్‌కార్డుల వివరాలు

ఆహారభద్రత 2,00,353

అంత్యోదయ 13,859

అన్నపూర్ణ 66

మొత్తం 2,14,278

వీరికి 4,522.789

మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా

సన్న బియ్యం బువ్వ బాగుంది

రేషన్‌ షాపుల ద్వారా ఇస్తున్న సన్న బియ్యం బువ్వ బాగుంది. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం అన్నం పిల్లలు తినేవారు కాదు. దీంతో కొంత బియ్యాన్ని వ్యాపారులకు అమ్మి వచ్చిన పైసలతో సన్న బియ్యం కొనేవాళ్లం. ఇప్పుడు ఇంటిళ్లి పాది రేషన్‌ బియ్యం తింటున్నాం.

– మంగలి చెన్నయ్య, పాపన్నపేట

సంబురంగా సన్నబియ్యం1
1/1

సంబురంగా సన్నబియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement