మూడు రోజుల్లో బిల్లులు | - | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో బిల్లులు

May 4 2025 8:08 AM | Updated on May 4 2025 8:08 AM

మూడు

మూడు రోజుల్లో బిల్లులు

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని మిర్జాపల్లి తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మూడు రో జుల్లో ఇంటి బిల్లులు రానున్నాయని ఎంపీడీఓ దామోదర్‌ తెలిపారు. శుక్రవారం సాక్షిలో ‘రాని బిల్లులు.. ఆగిన నిర్మాణాలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా స్పందించిన గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు టెక్నికల్‌ సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. శనివారం మిర్జాపల్లి తండాలో లబ్ధిదారుల బెస్‌మెంట్‌ ఫొటోలను ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్‌ చేశామన్నారు. మూడు రోజుల్లో లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కానున్నాయని వివరించారు.

సకాలంలో ఇందిరమ్మ

సర్వే పూర్తి చేయండి

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని గ వ్వలపల్లిలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను డీపీఓ యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా లబ్ధిదారులు నివసిస్తున్న ప్రస్తుతం నివాసం, ఖాళీ స్థలం పరిశీలించారు. అర్హులైన వారికి మొదటి దశలో ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్య దర్శులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ఇంటి పన్ను వ సూలు చేయాలన్నారు. వ్యాపారుల లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేయాలని సూచించారు.

రైతులు ఇబ్బంది పడొద్దు

తూప్రాన్‌: కొనుగోలు కేంద్రాల ద్వారా తప్పనిసరిగా నిత్యం 500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని యావపూర్‌ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ని ర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్రాక్టర్లు, లారీల్లో రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ విజయలక్ష్మి సిబ్బంది ఉన్నారు.

చిరుత సంచారం..

భయం భయం

రామాయంపేట(మెదక్‌): మండలంలోని కోనాపూర్‌ చిన్నతండా సమీపంలో చిరుత సంచారంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం వాటర్‌మెన్‌కు, మరో యువకుడికి చిరుత కనిపించింది. దీంతో వారు తండావాసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్‌ అధికారి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తండాకు వెళ్లి ఆరా తీశారు. తాము వ్యవసాయ పనులకు వెళ్తున్న క్రమంలో చిరుత దాడి చేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ భయాందోళన చెందవద్దని, తాము చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌ఓ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా టపాకాయలు కాల్చి డప్పు చప్పుళ్లు చేయించారు.

మూడు రోజుల్లో బిల్లులు 
1
1/3

మూడు రోజుల్లో బిల్లులు

మూడు రోజుల్లో బిల్లులు 
2
2/3

మూడు రోజుల్లో బిల్లులు

మూడు రోజుల్లో బిల్లులు 
3
3/3

మూడు రోజుల్లో బిల్లులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement