
డంప్‌యార్డును ఎత్తి వేయాలి
నర్సాపూర్: ప్యారానగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డును ఎత్తి వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. నర్సాపూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. డంప్‌యార్డుతో నర్సాపూర్ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ డంప్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. దీక్షల్లో జేఏసీ నాయకులు శ్రీధర్‌గుప్తా, రాజేందర్, భిక్షపతి, జ్ఞానేశ్వర్, రమణరావు, మార్వాడి సంఘం నాయకులు మేఘరాజ్, రమేశ్, మోహన్ పాల్గొన్నారు.