భూమికి భూమి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

భూమికి భూమి ఇవ్వాలి

Jun 25 2024 11:36 AM | Updated on Jun 25 2024 11:36 AM

భూమిక

భూమికి భూమి ఇవ్వాలి

నర్సాపూర్‌: భూమికి భూమి, లేదా ఎకరానికి రూ. 60 లక్షలు ఇస్తేనే సంగారెడ్డి కాలువకు తమ భూములు ఇస్తామని రైతులు తేల్చిచెప్పారు. సోమవారం భూసేకరణ కోసం శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కుల గ్రామ రైతులతో నర్సాపూర్‌ రైతు వేదికలో అవార్డు సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు తమ అభిప్రాయాలను ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డికి లిఖితపూర్వకంగా అందజేశారు. రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ చెప్పారు.

అపరిచితులను నమ్మొద్దు

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ సఖీ కేంద్రం, మై ఛాయిస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమ వారం మండలంలోని అక్కన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గృహహి ంస, వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, బాలకార్మిక నిర్మూలన, మానవ అక్రమ రవాణా తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుడ్‌, బ్యాడ్‌ టచ్‌ విషయమై తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిచయం లేని వారిని నమ్మవద్దని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో సఖీ కేంద్రం కేస్‌ వర్కర్‌ కళావతి, పారా మెడికల్‌ మంజుల, పోలీసులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

25 వేలతో

మెగా డీఎస్సీ వేయాలి

మెదక్‌మున్సిపాలిటీ: 25 వేల పోస్టులతో ప్రభు త్వం మెగా డీఎస్సీని ప్రకటించాలని అభ్యర్థు లు కోరారు. సోమవారం మెదక్‌ పట్టణంలోని లైబ్రరీలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 25 వేల పోస్టులకు తగ్గకుండా డీఎస్సీ వేయాలన్నారు. అలాగే పరీక్షకు మరో 3 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అభ్యర్థులు వెంకట్‌, మహిపాల్‌, చంద్రశేఖర్‌, శ్రావణ్‌, లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు

మెదక్‌ కలెక్టరేట్‌: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రవేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ అవుట్‌డోర్‌ స్టేడియంలో జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9347344440, 9493594388 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయ

ఉద్యోగులకు మెమోలు

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఉద్యోగులకు మెమోలు జారీ అయ్యా యి. ఏఈఓ శ్రీనివాస్‌, ఏఈ అంజయ్య, ప్లంబ ర్‌ విజయకుమార్‌లకు సంజాయిషీ మెమోలు జారీ చేస్తూ ఈవో బాలాజీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈఓ కార్యాలయంలో పరిపాలనా విషయంపై చర్చ జరిగే సమయంలో ఏఈఓ, ఏఈ, ప్లంబర్‌ ఒకరినొకరు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగిన విషయం విదితమే. స్పందించిన ఈవో పై ముగ్గురు ఉద్యోగులు మూడు రోజులలో సంజాయిషీ ఇవ్వాలని మెమో జారీ చేశారు. సంజాయిషీ సంతృప్తిగా లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

ఇదిలా ఉండగా.. ఆలయ ఏఈఓ గంగా శ్రీని వాస్‌, ప్లంబర్‌ సార్ల విజయ్‌కుమార్‌పై ఎలక్ట్రిషన్‌ ఏఈ అంజయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం విధుల్లో ఉండగా తనను అకారణంగా దూషిస్తూ కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

భూమికి భూమి ఇవ్వాలి 
1
1/1

భూమికి భూమి ఇవ్వాలి

Advertisement
 
Advertisement
Advertisement