అటవీప్రాంత అభివృద్ధికి కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అటవీప్రాంత అభివృద్ధికి కృషిచేయాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

● రాష్ట్రమంత్రి వివేక్‌ వెంకటస్వామి

చెన్నూర్‌రూరల్‌: అటవీప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అని రాష్ట్ర మైనింగ్‌, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని కిష్టంపేట సమీపంలోని అంబేద్కర్‌ పా ర్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జిల్లా అటవీశాఖ అధికారి రాహూల్‌ కిషన్‌ జాదవ్‌, చెన్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేశ్‌ తివారితో కలిసి హాజరయ్యారు. ముందుగా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భా వితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించ డం కోసం అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈప్రాంతంలోని మొసళ్ల పార్కును ఇతర ప్రాంతాల పర్యాటకుల కోసం తీ ర్చిదిద్దుతామన్నారు. తద్వారా పర్యాటక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజ ల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. చె న్నూర్‌లో త్వరలో వంద పడకల ఆసుపత్రిని ప్రా రంభిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మా ట్లాడారు. అటవీ అభివృద్దిలో భాగంగా ప్రతి ఒక్క రు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement