‘మోదీ పాలనలో అభివృద్ధి’ | - | Sakshi
Sakshi News home page

‘మోదీ పాలనలో అభివృద్ధి’

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

మంచిర్యాలటౌన్‌: ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు పరిపాలనలో దేశం ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు పాలన సందర్భంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ చిత్రపటంతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు దుర్గం అశోక్‌, రంగ శ్రీశైలం, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, సత్రం రమేశ్‌, కుర్రె చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, గోలి రాము, మాధవరపు రమణరావు, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement