మంచిర్యాలక్రైం: రాష్ట్రాన్ని నేర రహితంగా మా ర్చేందుకు కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవా రం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం విధి నిర్వహణలో అత్యున్నత ప్రతి భ కనబర్చిన పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలు, సే వా పతకాలు ప్రదానం చేశారు. మంచిర్యాల సీ సీఎస్ (సెంట్రల్ క్రైమ్‌స్టేషన్) ఎస్సై దుర్గం లలి తకు ఉత్తమ సేవా పతకం ఇచ్చారు. అడిషన ల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాశ్, శ్రీనివాస్, రమేశ్, నాగేంద్రగౌడ్, సీఐలు, ఎస్సైలున్నారు.


