సంక్షేమమే లక్ష్యంగా పాలన | - | Sakshi
Sakshi News home page

సంక్షేమమే లక్ష్యంగా పాలన

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రాధాన్యం ● ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు ● ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ● హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు

మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ: జిల్లాలో 974 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, కిశోర బాలికలు, 0–3 ఏళ్ల పిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. దివ్యాంగులకు 45 రిట్రో ఫిట్టెడ్‌ మోటార్‌ వాహనాలు, 12 ల్యాప్‌టాప్‌లు, 14 బ్యాటరీ ఆపరేటెడ్‌ వీల్‌ చైర్‌లు, రెండు స్మార్ట్‌ ఫోన్‌లు, 18 మొబైల్‌ బిజినెస్‌ బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిళ్లు, ఐదు ట్యాబ్‌లను అర్హత కలిగిన 96మంది దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చాం. ఆర్థికసాయం కింద ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున అందిస్తున్నాం.

విద్యాశాఖ: ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. జిల్లాలో 18 కేజీబీవీలను ఇంటర్‌ వరకు నవీకరించాం. తాండూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాలలోని విద్యాలయాలను యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా మార్చాం. కస్తూర్బాల్లో ఒక్కో భోజనశాల నిర్మాణానికి రూ.26 లక్షల చొప్పున మంజూరు కాగా, కన్నెపల్లి, నెన్నెల, దండేపల్లి, మందమర్రి మండలాల్లో పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. 25ఎకరాల విస్తీర్ణంలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల నిర్మాణానికి రూ.200కోట్ల చొప్పున కేటాయించగా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, చెన్నూర్‌ మండలంలోని సోమన్‌పల్లి, బెల్లంపల్లిలో శంకుస్థాపన చేశాం.

వైద్యరంగం: జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు రూ.300 కోట్లతో కొనసాగుతున్నాయి. రూ.23.75కోట్లతో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి భవనం, రూ.129.25 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.40 కోట్లతో నర్సింగ్‌ కళాశాల ద్వారా వైద్యం, విద్య కోసం భవన నిర్మాణం కొనసాగుతోంది. హాజీపూర్‌ మండలం గుడిపేటలో రూ.200 కోట్లతో చేపట్టిన వైద్యకళాశాల భవన నిర్మాణం పూర్తయింది. చెన్నూర్‌లో రూ.32.15కోట్లతో చేపట్టిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం రూ.5లక్షల బీమా పొందేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.

మహిళలకు పెద్దపీట: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా ఇప్పటివరకు జిల్లాలో 3కోట్ల 34లక్షల 49వేల మంది మహిళలకు రూ.141.40 కోట్ల లబ్ధి చేకూరింది. జిల్లాలో 1,24,839 మంది లబ్ధిదారులకు రూ.22.38 కోట్ల రాయితీ కింద 7,31,434 గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశాం. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,33,779 మంది వినియోగదారులకు రూ.111.61 కోట్ల లబ్ధి చేకూరింది.

రుణమాఫీ: జిల్లాలో 63,779 మంది రైతులకు రూ.537.32 కోట్ల రుణాలు మాఫీ చేశాం.

రైతుభరోసా: జిల్లాలో వానాకాలం 2025–26 పంటకు రూ.1,52,162 మంది రైతులకు రూ.198.13 కోట్లు అందించాం. యాసంగిలో 1,56,034 మంది రైతులకు రూ.125.95 కోట్లు ఖాతాల్లో జమ చేశాం. రైతు బీమా కింద 2025–26 సంవత్సరానికి 175 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.8.75 కోట్లు చెల్లించాం.

ధాన్యం కొనుగోళ్లు: యాసంగి ధాన్యం సేకరణకు జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 16,882 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 1,33,778 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. మొక్కజొన్న పంటనూ కొనుగోలు చేస్తున్నాం.

ఇందిరమ్మ ఇళ్లు: జిల్లాకు ఇప్పటివరకు 10,305 ఇళ్లు మంజూరయ్యాయి. 8,311 గ్రౌండింగ్‌ చేయగా 1,954 బేస్మెంట్‌, 1,151 గోడలు, 2,188 స్లాబ్‌ దశలో ఉన్నాయి. 1,763 ఇళ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో 912 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. 1,966 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయగా 1,314 పూర్తి కాగా, 803 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశాం.

రేషన్‌ బియ్యం: జిల్లాలో 2లక్షల 55వేల 689 రేషన్‌ కార్డుల ద్వారా లబ్ధిదారులకు 14,438 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం ప్రతీ నెల పంపిణీ చేస్తున్నాం.

ఉపాధిహామీ: ఉపాధిహామీ పథకంలో భాగంగా 1,18,222 మంది కూలీలకు జాబ్‌కార్డులు అందించి 100 రోజుల పని కల్పించి వేతనాల రూపంలో రూ.23.94 కోట్లు చెల్లించాం. రూ.88.35 లక్షల సామగ్రి అందజేశాం.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద ఇప్పటివరకు 36,287 మంది పేదింటి ఆడ బిడ్డలకు చెక్కులు ఇచ్చాం.

నీటి పారుదలశాఖ: జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన కార్మెల్‌పాఠశాల నుంచి గోదావరి నది వరకు రూ.255.59 కోట్లతో కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, రూ.213 కోట్లకు పరిపాలన అనుమతులు లభించగా పనులు కొనసాగుతున్నాయి.

పురపాలక సంఘాలు: మంచిర్యాల నగరపాలక సంస్థతోపాటు పాటు ఐదు మున్సిపాలిటీల్లో రూ.కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సమీకృత కూరగాయల మార్కెట్లు, వైకుంఠ ధామాలు, డంప్‌యార్డులు, ప్లే గ్రౌండ్‌లు, చిల్డ్రన్‌ పార్కులు, డ్రైనేజీలు, మహిళా భవనాలు, ఓపెన్‌ జిమ్‌లు, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ మహాప్రస్థానం నిర్మించాం.

పోలీస్‌శాఖ: మహిళల భద్రతకు అధిక ప్రధాన్యం ఇస్తూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక షీ టీమ్‌లు ఏర్పాటు చేసి ఈవ్‌ టీజింగ్‌ను ఆరికట్ట డంలో సమర్థవంతంగా పని చేస్తున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో స్నేహ పూర్వక వాతావరణం కల్పించాం.

ఆబ్కారీశాఖ: ఎకై ్సజ్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖల సమన్వయంతో గుడుంబా నియంత్రణకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది 388 కేసులు నమోదు చేశాం.

రవాణాశాఖ: నిర్ధేశిత పన్నుల ద్వారా రూ.66.93 కోట్లతో ప్రగతి సాధించడంతో పాటు రహదారులపై నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

ఇందిరా మహిళాశక్తి: ఇందిరా మహిళాశక్తి ద్వారా క్యాంటీన్‌లు, మీ సేవా కేంద్రాలు, చిన్న పరిశ్రమలు ఇతర విభాగాల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందించాం. మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు సభ్యులకు రూ.10లక్షలు విలువైన సంచార చేపల వాహనాలు 60 శాతం రాయితీతో మంజూరు చేయగా, వారికి రూ.18 లక్షల లబ్ధి చేకూరింది. 16 మండలాలకు ఆర్టీసీ అద్దె ఒప్పందంతో 16 బస్సులు మంజూరు చేసి అదనపు ఆదాయాన్ని సమకూర్చాం. 8,817 స్వయం సహాయక సంఘాలకు రూ.23.90 కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చాం. 44,864 మంది విద్యార్థులకు లక్షా 752 యూనిఫాంలు అవసరం కాగా, తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించి రూ.54లక్షలు చెల్లించాం. బ్యాంక్‌ లీంకేజీ ద్వారా 20.56 కోట్లు అందించాం.

జాతీయ జెండాకు వందనం చేస్తున్న వేణుగోపాల్‌రావు, ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీసీపీ భాస్కర్‌, తదితరులు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మా ర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీపీ భాస్కర్‌, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రా ములు, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులోగల తెలంగాణ అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

విజయవంతంగా

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక

మార్చి 6నుంచి జూన్‌ 12వరకు చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా సా గుతోంది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరి శుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, రహదారి భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్‌ ని యంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువత క్రీడలు, మహిళలు, పర్యావరణం తదితర 10 అంశాలతో కూడిన కార్యక్రమాలను జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement