అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

దండేపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశా ల సంబరంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధర్మ య్య, ఏఎంసీ చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌, తహసీల్దార్‌ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌, హౌసింగ్‌పీడీ బన్సీలాల్‌, ఆర్‌ఐ భూమన్న పాల్గొన్నారు.

హాజీపూర్‌ మండలంలో..

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మండలంలోని రా పల్లి, కర్ణమామిడి తదితర గ్రామాల్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు కని పించాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్లి శాలువాలు కప్పి సన్మానించారు. రాపల్లిలో లబ్ధిదారులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చిత్రపటాలతో గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, ఎంపీవో సుమన్‌, గృహ నిర్మాణ శాఖ ఏఈ వాజ్మయి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

లక్సెట్టిపేట మండలం కొత్తూరులో..

లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్మించిన 36 ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గ్రామస్తులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, సర్పంచ్‌ నల్లపు రజిత–పోచమల్లు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement