మంచిర్యాలటౌన్: సీఎం రేవంత్‌రెడ్డి సోమవా రం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి మంచిర్యాలకు వచ్చినా ఎలాంటి హామీ లు ఇవ్వకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరా శకు గురయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేశ్‌గౌడ్, అమిరిశెట్టి రాజ్‌కుమార్, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామిరెడ్డి, బేర సత్యనారాయణ, మెట్టుపల్లి జయరామారావు పాల్గొన్నారు.
నేటి నుంచి సదరం శిబిరాలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 3నుంచి 30వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీవో కిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 30వరకు మీ సేవా కేంద్రాల్లో సదరం పోర్టల్‌లో పేర్లు న మోదు చేసుకున్నవారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3,9,16,22,25,29 తేదీల్లో ఆర్థో/లోకోమోటా ర్ సమస్యలు కలవారికి, 4,8 తేదీల్లో వినికిడి, భాషాలోపం, మాట్లాడకపోవడం లాంటి సమస్యలున్నవారికి, 5న సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల కు, 10,23 తేదీల్లో దృష్టి లోపాలు కలవారికి, 30న మానసిక అనారోగ్యం, మేధోవైకల్యం కలవారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపా రు. దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలలో హాజరు కావాలని సూచించారు.


