పీహెచ్‌సీ ఎదుట రోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీ ఎదుట రోగుల నిరసన

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

వేమనపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రం ఎదుట రోగులు మంగళవారం నిరసన తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన వైద్యాధికారి, సిబ్బంది ఆ తర్వాత ఇళ్లకు వెళ్లారు. మంగళవారం వైద్యం కో సం ఎనిమిది మంది గర్భిణులు, ఇద్దరు తేలుకాటు బాధితులు, గొర్లపల్లి కిత్తకాలనీకి చెందిన తీవ్ర అ నారోగ్యంతో ఓ వృద్ధురాలు, సాధారణ రోగులు 30 మంది వరకు వచ్చారు. స్టాఫ్‌నర్స్‌ రజిత, కాంటింజెంట్‌ వర్కర్‌ బాపు మాత్రమే విధుల్లో ఉన్నారు. 24 గంటల(రౌండ్‌దిక్లాక్‌) వైద్యం అమల్లో ఉండాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది వెళ్లిపోవడంపై రోగులు ఆగ్ర హించారు. రోజంతా పడిగాపులు కాచి వెళ్లి పోయా రు. జెండావిష్కరణ, విధులకు వచ్చిన వైద్యాధికారి అన్వేశ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ముగ్గురు హెల్త్‌ అసిస్టెంట్లు, ఏడుగురు ఏ ఎస్‌ఎంలు, డీఈవో ఉదయమే వెళ్లిపోయారు. వైద్యాధికారి అన్వేశ్‌ ను సంప్రదించగా.. స్టాఫ్‌నర్స్‌ మాత్రమే విధుల్లో ఉన్నారని, సిబ్బంది మధ్య గొడవలతో వెళ్లిపోయారని చెప్పడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement