నస్పూర్: మాజీ సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అంతకుముందు తె లంగాణతల్లి విగ్రహం చౌరస్తాలో జెండా ఎగు రవేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నాయకుడు విజిత్‌రావు, టీబీజేకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, నస్పూర్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు పవన్‌కుమార్, తిరుపతి తదితరులున్నారు.
డీఈవోగా లలిత
మంచిర్యాలఅర్బన్: డీఈవోగా లలితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాలలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు కు మురంభీం ఆసిఫాబాద్ డీఈవోగా బాధ్యతలు అప్పగించగా మంగళవారం రిలీవ్ చేశారు. మంచిర్యాల డీఈవో యాదయ్య బదిలీపై హై దరాబాద్‌కు వెళ్లడగా ఇక్కడ లలితకు డీఈవో గా అదనపు బాధ్యత(ఎఫ్‌ఏసీ)అప్పగించారు.


