భీమిని: కన్నెపల్లి మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. కార్యక్రమం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభం కాగా ప్రొటోకాల్ వివాదంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పరస్పరం దూషణకు దిగి పెనుగులాడుకోవడంతో పోలీ సులు ఆపారు. అనంతరం సర్పంచులు, నా యకులు చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై బీఆ ర్‌ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. అనంతరం కాంగ్రెస్ డౌన్ డౌన్.. అంటూ నిన దించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఎస్సై భాస్కర్‌రావు వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో రైతువేదికలోని 20కుర్చీలు విరిగి, డోర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు ఏఈవో తెలిపారు.


