నేత్రపర్వంగా వీరహనుమాన్‌ విజయయాత్ర | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా వీరహనుమాన్‌ విజయయాత్ర

Apr 5 2026 8:42 AM | Updated on Apr 5 2026 8:42 AM

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రం మంచిర్యాలలో హనుమాన్‌ నినాదం మార్మోగింది. శనివారం రాత్రి బజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో వీర హనుమాన్‌ విజయ యాత్ర నేత్రపర్వంగా సాగింది. నగర వీధుల గుండా సాగిన ర్యాలీలో పార్టీలకతీతంగా యువకులు, మహిళలు పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. ఐబీ చౌరస్తా హనుమాన్‌ విగ్రహం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర వెంకటేశ్వర టాకీస్‌, ముఖరాం చౌరస్తా మీదుగా సాగింది. మహిళలు కోలాట ప్రదర్శనలు, యువకులు నృత్యాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నగర ధర్ని మేయర్‌ ఽమధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement