చెన్నూర్: గోదావరి పుష్కరాల దృష్ట్యా చెన్నూర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పుష్కరాలకు రూ.500 కోట్లు మంజూరు చేయించాలని అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులను గుర్తించాలని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. జిల్లా కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్లు ఏతం శివకృష్ణ, నాయకులు వెంకటనర్సయ్య, జాడి తిరుపతి, బుర్ర రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.


