మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి సోమవారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలను స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎత్తు, బరువు, నైపుణ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్టు, 800 మీటర్ల పరుగుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు.


