లక్సెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్సెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలి

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

లక్సెట్టిపేట: లక్సెట్టిపేట కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని మండలంలోని అఖిలపక్ష నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఐబీ ఆవరణలో అఖిలపక్ష పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్సెట్టిపేట పట్టణానికి గతంలో నియోజకవర్గ హోదా ఉన్నదని తెలిపారు. దండేపల్లి, జన్నారం, హాజీపూర్‌ మండలాలను కలుపుతూ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నియోజకవర్గ ఏర్పాటుకు పోరాటం చేస్తామని, సాధన కమిటీని నిర్ణయించి ముందుకు సాగుతామని అన్నారు. మండల అఖిలపక్ష నాయకులు నల్మాస్‌ కాంతయ్య, పొట్టేలు శ్రీనివాస్‌గౌడ్‌, లింగయ్య, సుధాకర్‌, దండేపల్లి, జన్నారం, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement