జైపూర్: మండలంలోని కాన్కూర్ అటవీప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు. టీజీఎఫ్‌డీసీకి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలోని వాగులో రెండు చోట్ల నీటి ఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూడిక తొలగించి అడ్డుకట్టలు వేశారు. టీజీఎఫ్‌డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్‌కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్‌లో వేసవిలో నీటి వృథాను అరికట్టి జల సంక్షరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటికుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


