ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్‌గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్, ఆడ సంపత్, సలహాదారుగా పుర్క ఉద్దవ్, మడావి గంగారాం, పూసం ఆనంద్ రావు, ఎన్నికయ్యారు.
గవర్నర్‌ను కలిసిన ‘సొసైటీ’ సభ్యుడు
పాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి
పాతమంచిర్యాల: రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల సంక్షేమానికి రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, గత బడ్జెట్‌లో రూ.183 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో కరెంట్ బిల్లులు పెరిగిపోయాయని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తెలిపారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు నిర్వహిస్తామని, భవిష్యత్‌లో ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజుల రామచంద్ర, నాయకులు ఓదెలు, చందు, భాగ్య, శనిగారపు సత్యం, మామిడి రమేష్, కోటిపల్లి కళావతి, లక్ష్మణ్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు.


