ఆదిలాబాద్‌టౌన్: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల కు శనివారం జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నెల రోజుల్లో 105 ఫోన్లు రికవరీ చేశామని, వీటి విలువ రూ.15 లక్షల పైబడి ఉంటుందని తెలిపారు. ఏడాదిలో 1100 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందించామన్నారు. జిల్లా కేంద్రంలో రైతుబజార్, బస్టాండ్, రైల్వేస్టేషన్, రిమ్స్ తదితర ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంట నే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసి సమీప పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, ఆర్‌ఎస్సై గోపికృష్ణ, రియాజ్, మజీద్ పాల్గొన్నారు.


