నస్పూర్: కేంద్రపభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆ యన నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. లేబర్‌కోడ్‌ల అమలు ను నిరసిస్తూ ఏప్రిల్ 1న ఆందోళనలు చేపడుతామని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో సింగరేణి మనుగడ, భవిష్యత్తు ప్రశ్నాత్మకంగా మారిందన్నారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మారుపేర్ల సమ స్య పరిష్కరించాలని, పెర్క్స్ పై ఇన్‌కాం టా క్స్ యాజమాన్యమే భరించాలన్నారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. రాబోయే పదేళ్లలో అన్ని భూగర్భ గనులు మూతపడే ప్రమాదం ఉందన్నారు. సేవ్ సింగరేణి పేరుతో ఏఐటీయూసీ చేస్తున్న కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపా రు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కక్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం, రాష్ట్ర నాయకులు మేకల రామన్న, దేవయ్య, కిష్టయ్య, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.


