గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44 సీతాగొంది సమీపంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఉట్నూర్ మండలం బీర్సాయిపేట్ చెందిన అప్పర్‌ఖాన్, రుమాన బేగం (43) దంపతులు. అనారోగ్యంతో బాధపడుతున్న రుమానా బేగంను జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు శనివారం బైక్‌పై బయల్దేరారు. చింతగూడ కార్నర్ వద్ద భారీ కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రుమానా బేగం తలకు తీవ్రంగా, అప్పర్‌ఖాన్‌కు స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా అప్పటికే రుమానాబేగం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, రెండురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో సాద్వి కుమారి అశ్విని మృతి చెందింది. పోలీసులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు, బాధితులు పేర్కొన్నారు.


