● నిర్వహణలో ఆర్టీసీ నిర్లక్ష్యం! ● పరిమితికి మించి ప్రయాణం ● కానరాని ప్రథమ చికిత్స కిట్లు ● ప్రయాణికులకు తప్పని పాట్లు | - | Sakshi
Sakshi News home page

● నిర్వహణలో ఆర్టీసీ నిర్లక్ష్యం! ● పరిమితికి మించి ప్రయాణం ● కానరాని ప్రథమ చికిత్స కిట్లు ● ప్రయాణికులకు తప్పని పాట్లు

Mar 29 2026 7:11 AM | Updated on Mar 29 2026 7:11 AM

● నిర్వహణలో ఆర్టీసీ నిర్లక్ష్యం! ● పరిమితికి మించి ప్రయాణం ● కానరాని ప్రథమ చికిత్స కిట్లు ● ప్రయాణికులకు తప్పని పాట్లు

మంచిర్యాలఅర్బన్‌: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం..’ అని యాజమాన్యం ప్రకటనలు గుప్పిస్తున్నా ప్రథమ చికిత్స బాక్స్‌ల ఏర్పాటులో అలసత్వం ప్రదర్శిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే తాత్కాలిక వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఫస్ట్‌ ఎయిడ్స్‌ బాక్స్‌లు మందులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులకు చిన్న గాయమైనా చికిత్స చేసే పరిస్థితి కానరావటం లేదు. ఆ స్పత్రికి తీసుకెళ్లేవరకు చికిత్స అందకుండా పోతోంది. ఇటీవల తరచూ ఏదోచోట జరుగుతున్న రహదారి ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలు మరువకముందే మార్కాపురం వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన విషాద ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.

చాలా బస్సుల్లో కనిపించని కిట్లు

మంచిర్యాల డిపోలో 148 బస్సులుండగా 62వేల కిలోమీటర్లు తిప్పుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సుల్లో ప్రథమ చికిత్స (ఫస్ట్‌ ఎయిడ్‌) పెట్టెలు కచ్చితంగా ఉండాలనే నిబంధనలున్నాయి. టించర్‌ అయోడిన్‌, యాంటీ సెప్టిక్‌ క్రీం, దూది, కత్తెర, కాటన్‌ బ్యాండేజ్‌, గాయాలకు ఎలస్టిక్‌, వాటర్‌ప్రూప్‌ఫ్లాస్టర్‌ ఉండాలి. ‘సాక్షి’ పరిశీలనలో మంచిర్యాల డిపోకు చెందిన చాలా బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్స్‌ బా క్స్‌లున్నా మందులు లేవు. ఆ పెట్టెల్లో కాగితాలు, గుడ్డలు, ఖాళీ బాక్స్‌లు కనిపించాయి. ఫైర్‌ ఎక్స్‌ టింగ్విషర్‌ పరికరం కూడా కొన్నింట్లో కనబడలేదు. బస్సుల్లో ప్రయాణికులు గాయపడితే కండక్టర్‌ ప్రథమ చికిత్స చేయాల్సి ఉండగా అవగాహన లేక మందులున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అద్దె బస్సుల్లో ఉండాల్సిన అగ్ని మాపక సిలిండర్‌ను ఫిట్‌నెస్‌ కోసం వెళ్లిన బస్సుల్లో ఉంచినట్లు ఓ డ్రైవర్‌ చెప్పడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పూర్తిస్థాయిలో అగ్నిమాపక పరికరాలుండగా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం దశలవారీగా అమర్చుతున్నట్లు తెలుస్తోంది. బస్సుల్లో ప్రయాణికులకు పౌచ్‌ కిట్‌ పంపిణీ కూడా ఊసే లేకుండా పోయింది.

ప్రమాదాలకు బాధ్యులెవరు?

ఖాళీ సీట్లతో రాకపోకలు సాగించిన ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. పండుగ వేళల్లో రద్దీ మరీ అధికం. పల్లెవెలుగు బస్సుల్లో 55 మంది, ఎక్స్‌ప్రెస్‌లో 39, రాజధానిలో 36, లగ్జరీలో 36, లహరిలో 48 మంది ప్రయాణికుల కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతం ఏ బస్సులో చూసినా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు వెళ్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో నడిచే సంస్థ బస్సులకు మినహాయింపు ఇవ్వగా.. అద్దె బస్సులకు మాత్రం ఇన్సూరెన్స్‌ చేయిస్తోంది. బాధిత కు టుంబాలు కోర్టుల్లో పోరాడి ఆర్టీసీ నుంచి పరిహారం పొందటం మినహా చేసేదేమీ లేకుండా పోతోంది. అద్దె బస్సుల్లో కెపాసిటీకి తగినట్లు ప్రయాణికులు వెళ్తేనే బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం 80నుంచి 100మందికి పైగా ప్రయాణిస్తుండగా ఏదైన ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్‌ సంస్థ చేతుతెల్తే అవకాశాలు లేకపోలేదని అద్దె బస్సుల యజమానులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు.

ఏటా పెరుగుతున్న మరణాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లో 630 ఆర్టీసీ, అద్దె బస్సులున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు ప్రయాణికులకు కనీసం ప్రథమ చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. 2021లో 44 ప్రమాదాలు జరగగా 15 మంది మృత్యువాత పడ్డారు. 2021–22లో 44 ప్రమాదాల్లో 25 మంది, 2022–23లో 43 ప్రమాదాల్లో 16 మంది, 2023–24లో 36 ప్రమాదాల్లో 16 మంది, 2024–25లో 46 ప్రమాదాల్లో 25మంది మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement