మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ 2026–27 సంవత్సరపు ముసాయిదా బడ్జెట్‌ను శనివారం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేశ్ సమక్షంలో కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. అంచనా బడ్జెట్‌ను రూ.74.76కోట్ల 31వేలుగా నిర్ణయించి ప్రకటించారు. సాధారణ ఆదాయం రూ.50.37కోట్ల 58 వేలు, గ్రాంట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ. 24.38కోట్ల 56వేలుగా నిర్ణయించారు. ఏప్రిల్ 1, 2026 నాటికి మిగులు బడ్జెట్ కింద ప్రారంభ విలువ రూ.8.89 కోట్లుగా చూపించారు. 2025 –26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను గతేడాది రూ.66.32కోట్ల 32వేలుగా అంచనా వేయగా, ఈ నెల 31నాటికి అయిన ఖర్చు రూ.72.51కోట్ల 66వేలుగా వివరించారు.
ఆదాయం రూ.50.37కోట్లు
కార్పొరేషన్‌కు పన్నులు, ఇతరత్రాల రూపంలో రూ.50.37కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్నుల రూపంలో రూ.21.84 కోట్లు, కేటాయించిన ఆదాయాలు రూ.6.82కో ట్లు, అద్దె ద్వారా రూ.3.48కోట్లు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య విభాగం రశీదుల ద్వారా రూ.1.83 కో ట్లు, పట్టణ ప్రణాళిక విభాగం రశీదుల ద్వారా రూ.12.59కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.3.81కోట్లు, మొత్తం రూ.50.37 కోట్ల ఆదా యం రానున్నట్లు అంచనా వేశారు. వీటితోపాటు కాపిటల్ ఫండ్ (సీపీఎస్) నాన్ ప్లాన్ నిధులు రూ.11.80 కోట్లు, ప్రణాళిక నిధులు రూ.3.60 కోట్ల 24వేలు, డిపాజిట్లు రుణాలు రూ.41.30లక్షలు, ఇతర నిధులు రూ.8.56కోట్ల 87వేలు.. మొ త్తంగా రూ.23.97కోట్ల 26వేలు వస్తాయని భా వించారు. పన్ను వనరులు, కాపిటల్ ఫండ్ ని ధులన్నీ కలిపి రూ.74.76కోట్ల 14వేల బడ్జెట్‌గా అంచనా వేశారు. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ వ్యయం, ఇంజినీరింగ్ విభాగాల ని ర్వహణ, సాధారణ పరిపాలన, నగర ప్రణాళిక విభాగం, వసతులు, వార్డులవారీగా నాన్‌ప్లాన్, ప్రణాళిక, ఇతర నిధుల ఖర్చు అంచనా వేశారు.
నిరసన తెలిపిన ప్రతిపక్షాలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌పై తమను మాట్లాడించలేదంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు సమావేశం అనంతరం నేలపై కూర్చుని నిరసన తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్‌గౌడ్ నోటికి గుడ్డ కట్టుకుని నిరసన వ్యక్తంజేశారు. బీజేపీ కార్పొరేటర్ బొట్ల అనిత, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ పెట్టెం స్వరూపకు మాత్రమే మాట్లాడే అవకాశమివ్వగా, తమకూ ఇవ్వాలని మిగతావారు డిమాండ్ చేశారు. పట్టణ ప్రగతి నిధులు ప్రతీనెల మంచిర్యాలకు రూ.75లక్షలు, నస్పూరుకు రూ.65లక్షలు రావాల్సి ఉండగా, 28 నెలలుగా పెండింగ్‌లో ఉంటే ఎందుకు తెప్పించడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కార్పొరేట ర్లు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన జిరాక్స్‌ల ఖర్చు ఏడాదికి రూ.12.50 లక్షలను బయటి వ్యక్తులకు ఎందుకు చెల్లిస్తున్నారని, రూ.4లక్షలకు కొత్త జిరాక్స్ మిషన్ వస్తుందని సూచించారు. అనవసర ఖర్చులు చేయడంపై వారు నిరసన వ్యక్తంజేశారు.


